Anil Ravipudi, Mokshagna: ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే: అనిల్ రావిపూడి

నందమూరి వారసత్వం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ కొందరు ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. ఇక ప్రస్తుతం నందమూరి వారసులుగా బాలకృష్ణ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ అభిమానులలో ఆశలు కల్పించడమే కాకుండా ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి ప్రకటన ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులను కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత రాజమౌళి చేతుల లో పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ విధంగా రాజమౌళి మాత్రమే కాకుండా బోయపాటి శ్రీను వివి వినాయక్ పూరి జగన్నాథ్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడికి ఇదే ప్రశ్న ఎదురవడంతో ఈయన ఈ ప్రశ్నపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వినపడుతుంది ఇక ప్రస్తుతం నా వరకు వచ్చింది కనుక ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది అంటూ అనిల్ వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ తన దగ్గర ఎప్పుడూ ప్రస్తావన తీసుకు రాలేదని క్లారిటీ ఇచ్చారు.

ఒకవేళ మోక్షజ్ఞ బాలకృష్ణ తన దర్శకత్వంలో లాంచ్ చేయమంటే చేయడానికి తనకి ఏమి ప్రాబ్లం లేదని అనిల్ వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం నా దృష్టి మొత్తం బాలకృష్ణ సినిమా గారి పైనే ఉందని ఈ సందర్భంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!


విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus