హృతిక్ తో ‘పటాస్’ రీమేక్ చేస్తా!

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి.. బాలీవుడ్ లో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే హృతిక్ రోషన్ తో ‘పటాస్’ రీమేక్ చేస్తానని చెబుతున్నారు. అనీల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించిన ‘గాలి సంపత్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఎఫ్2’ సినిమా ఆల్రెడీ హిందీలో రీమేక్ అవుతోందని.. తనకు ఛాన్స్ వస్తే ‘పటాస్’ సినిమాను హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలని ఉందని అన్నారు.

హృతిక్ కి మంచి బాడీ ఉందని.. సిక్స్ ప్యాక్ ఉంచుకొని దానికి తగ్గట్లు సరైన సినిమాలు చేయడం లేదని అన్నారు. అంత కటౌట్ పెట్టుకొని ఆయన ఏవేవో సినిమాలు చేస్తున్నారని.. ‘పటాస్’ లాంటి యాక్షన్ సినిమా చేయాలంటూ చెప్పుకొచ్చారు. తనకు వస్తే కచ్చితంగా హృతిక్ తో సినిమా తీస్తానని అన్నారు. అలానే తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడారు. ప్రస్తుతం మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని చెప్పారు.

హీరో రామ్ తో చాలా కాలంగా సినిమా అనుకుంటున్నానని.. కానీ కుదరలేదని అన్నారు. అలానే బాలయ్యతో ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పారు. మహేష్ బాబు సినిమా విషయంలో కూడా క్లారిటీ రాలేదని.. ఆయన్ని కలిసి మాట్లాడాలని.. అన్నీ పెండింగ్ లో ఉన్నాయని.. ఏదీ పక్కా కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus