కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ‘పటాస్’ (Pataas) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి.. సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు. అటు తర్వాత ‘సుప్రీమ్’ (Supreme) ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) వంటి సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఆ తర్వాత వెంకటేష్ (Venkatesh Daggubati).. వరుణ్ తేజ్(Varun Tej)..లతో చేసిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ (F2 Movie) తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి.. ఏకంగా మహేష్ బాబు (Mahesh Babu) వంటి స్టార్ డైరెక్టర్..తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు అనిల్ రావిపూడి.
ఆ సినిమాతో మహేష్ నమ్మకాన్ని కూడా నిజం చేశాడు. అటు తర్వాత చేసిన ‘ఎఫ్ 3’ (F3 Movie) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది. వరుసగా 8 హిట్లు కొట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి చరిత్ర సృష్టించాడు. ఇక అనిల్ రావిపూడి గత 5 సినిమాల ట్రాక్ రికార్డుని గమనిస్తే.. అతని గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది.
‘ఎఫ్ 2’ తో తొలి వంద కోట్ల చిత్రాన్ని అందుకున్న అనిల్.. ఆ వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ తో (Sarileru Neekevvaru) రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అటు తర్వాత ‘ఎఫ్ 3’ ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలు కూడా వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే 6 రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. చూస్తూంటుంటే..
ఈ సినిమా ఫుల్ రన్లో రూ.300 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇలా అనిల్ రావిపూడి తెరకెక్కించిన గత 5 సినిమాల్లో 3 రూ.100 కోట్ల సినిమాలు, 2 రూ.200 కోట్ల సినిమాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అతను తెరకెక్కించింది పాన్ ఇండియా సినిమాలు కాదు.. రీజనల్ మూవీస్ తోనే అనిల్ రావిపూడి ఈ రికార్డు సృష్టించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.