Anil Ravipudi: అనిల్ రావిపూడి మళ్ళీ సీనియర్ హీరోతోనే?

అనిల్ రావిపూడి పరిచయం అవసరం లేని పేరు. ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2 ‘ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్3 ‘ ‘భగవంత్ కేసరి’ వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయితే ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ అయ్యి.. 4 నెలలు కావస్తోంది. కానీ ఇంకా తన నెక్స్ట్ మూవీ ఏంటనేది అనౌన్స్ చేయలేదు రావిపూడి. ప్రస్తుతం స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. అనిల్ గత రెండు సినిమాలు కూడా సీనియర్ హీరోలతోనే చేశాడు.

‘ఎఫ్3 ‘ వెంకటేష్ తో, ‘భగవంత్ కేసరి’ బాలయ్యతో..! నెక్స్ట్ సినిమాకి స్టార్ హీరోని పట్టాలని అనిల్ ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు అని ఇన్సైడ్ టాక్. దిల్ రాజు బ్యానర్లో అనిల్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.కథ ఓకే అయినట్టు వినికిడి. ఇప్పుడు వెంకటేష్ తప్ప ఇంకో హీరో ఖాళీగా లేడు. వెంకటేష్ కి కూడా ‘ఎఫ్ 3 ‘ టైంలోనే అనిల్ ఇంకో చెప్పాడు. అది కూడా వెంకీకి నచ్చింది.

ఈ మధ్య మళ్ళీ వీళ్ళు కలిసినట్టు ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వెంకీ- అనిల్ కాంబోలో సినిమా ఫిక్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన వస్తే తప్ప అన్నీ కన్ఫర్మ్ అనలేము. వెంకటేష్ నుండి ఇటీవల వచ్చిన ‘సైంధవ్’ మూవీ ఆడలేదు. కాబట్టి (Anil Ravipudi) అనిల్ రావిపూడి వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడమే బెటర్.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus