Anil Ravipudi: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు.. అలాంటి సినిమాను ప్లాన్ చేశారా?

ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అనిల్ రావిపూడి తర్వాత సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా మెగా హీరోలతో అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఈ సినిమా విషయంలో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. వరుస విజయాలతో అనిల్ రావిపూడి రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెగా ఫ్యాన్స్ కు ఇది అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి. అయితే ఆ ఇద్దరు మెగా హీరోలు ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మెగా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏ ఇద్దరు మెగా హీరోలు నటించినా బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అనిల్ రావిపూడి తన సినిమాలలో కమర్షియల్ అంశాలు సైతం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు. అనిల్ రావిపూడి మరో రెండు సక్సెస్ లను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో నటించాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. చిరంజీవి, నాగార్జునలతో సైతం సినిమాలు చేయాలని అనిల్ రావిపూడి భావిస్తుండగా ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. అనిల్ రావిపూడిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus