‘అల్లుడు అదుర్స్’లో రావిపూడి హ్యాండ్!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాను రూపొందించారు. చాలా కాలంగా హిట్టు రాక ఇబ్బందిపడుతోన్న సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ సినిమా మీద నడిచే సినిమా ఇది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ అంతా ఈ సినిమాలో ఉన్నారు.

కేవలం ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. మిగిలిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ను పండించడంలో దిట్ట అయిన దర్శకుడు అనీల్ రావిపూడి గైడెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం సినిమా పూర్తయిన తరువాత దర్శకుడు అనీల్ రావిపూడికి చూపించారట. సినిమా చూసిన అనీల్ రావిపూడి కొన్ని ఇంప్రూవైజేషన్ సజెషన్ లు ఇచ్చారట. సాధారణంగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు దర్శకుడు వి.వి.వినాయక్ గైడెన్స్ కచ్చితంగా ఉంటుంది.

అయితే ఈసారి వినాయక్ తో పాటు అనీల్ రావిపూడి కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పండగకు పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘అల్లుడు అదుర్స్’ సినిమాకు బజ్ వచ్చింది. ఈ సినిమాపై అనీల్ హ్యాండ్ పడిందంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఢోకా ఉండదనిపిస్తుంది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus