విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ మూవీ రూ.50 కోట్ల పైనే బయ్యర్లకి లాభాలను అందించింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీ నిర్మాత తన బ్యానర్లో సినిమా చేయాలని అతన్ని కోరుతున్నాడు. కానీ అనిల్ మాత్రం దిల్ రాజు బ్యానర్లోనే ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఆ బ్యానర్లో అతను చేసిన ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా అన్ని సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
తాజాగా విడుదలైన ‘ఎఫ్3’ కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతతో బడ్జెట్ పెట్టించే విషయంలో కూడా అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో, నిర్మాతని అవసరమైన టైంలోనే ఖర్చు పెట్టించడంలో, నటీనటులకు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి చాలా జాగ్రత్త వహిస్తాడు.
అందుకే అతనితో టాప్ హీరోలు కూడా మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని చూస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. ‘ఎఫ్3’ చిత్రానికి హీరోలకంటే కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికం ఎక్కువట. వెంకటేష్ రూ.15 కోట్లు, వరుణ్ తేజ్ రూ.7 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటే …. అనిల్ రావిపూడి రూ.15 కోట్లు పారితోషికం పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ లో లాభాలు.. మొత్తం కలుపుకొని రూ.20 కోట్ల వరకు ఉంటుందట. అంతేకాదు థియేట్రికల్ పరంగా భారీ లాభాలు వస్తే అందులో కూడా అనిల్ కూడా వాటా ఇవ్వబోతున్నారని వినికిడి.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!