మహేష్ తో మూవీకి రెడీ అంటున్న వరుస విజయాల దర్శకుడు
- January 19, 2019 / 12:58 PM ISTByFilmy Focus
ప్రజంట్ జనరేషన్ లో మోస్ట్ లక్కీ అనొచ్చు లేదా టాలెంటెడ్ అనొచ్చు అనేది తెలియదు కానీ.. వరుసగా నాలుగు సింపుల్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్స్ రేస్ లో ముందుకొచ్చి నిల్చోన్నాడు అనిల్ రావిపూడి. బ్లాక్ బస్టర్ హిట్స్ కొత్తకపోయినా తనను నమ్మిన నిర్మాత ఎన్నడూ నష్టపోకుండా చూసుకున్నాడు అనిల్. అందుకే తన నెక్స్ట్ ప్రొజెక్ట్ ను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయాలని నిశ్చయించుకొన్నాడట. దిల్ రాజు బ్యానర్ లో ఇదివరకే మూడు సినిమాలు చేసిన అనిల్ రావిపూడికి ఆ బ్యానర్ లో ఇది నాలుగో సినిమా కానుంది.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇకపోతే.. తన అయిదో చిత్రాన్ని ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడట అనిల్ రావిపూడి. ఆల్రెడీ మహేష్ కి కథ చెప్పడం, దానికి మనోడు ఒకే చెప్పడం కూడా అయిపోయాయట. ప్రస్తుతం మహేష్ కి చెప్పిన లైన్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నాడట అనిల్ రావిపూడి. అదృష్టం కలిసొచ్చి మహేష్ సినిమా గనుక త్వరగా మొదలై.. ఆ సినిమాతో కూడా అనిల్ హిట్ కొడితే గనుక మనోడు సూపర్ స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.
















