ఘనంగా యానిమల్ నటుడి పెళ్ళి..యానిమల్ నటుడి పెళ్ళి ఫోటోలు వైరల్!

ఈ ఏడాది వరుసగా సినీ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి హీరోలు ఈ ఏడాది పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్స్ లో నటించే వారు, టివి షోలతో బుల్లితెర పై ఇమేజ్ సంపాదించుకున్న వారు సైతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మధ్యనే బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే సీరియల్ హీరో అయిన మానస్ కూడా పెళ్లి చేసుకున్నారు.

అంతేకాకుండా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో పాపులర్ అయిన ప్రేరణ కూడా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా నటుడు కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. విషయంలోకి వెళితే.. యానిమల్ నటుడు (Kunal Thakur) కునాల్ ఠాకూర్ .. ప్రముఖ బాలీవుడ్ నటి ముక్తి మోహన్ ని వివాహం చేసుకున్నాడు.

ఈమె గతంలో రవితేజ నటించిన దరువు సినిమాలో ఒక పాటకు డాన్స్ వేసింది. ఇక కునాల్ ఠాకూర్ కూడా బాలీవుడ్ లో చాలా హిట్ సినిమాల్లో నటించాడు. అయితే యానిమల్ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి ఇతను నోటెడ్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఆ సినిమాలో రశ్మిక ని మొదట నిశ్చితార్థం చేసుకునే పెళ్ళి కొడుకుగా కనిపించాడు. ఇతని పెళ్ళి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus