రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలై భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సాధిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. సునీల్, నాగబాబు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. జైలర్ సినిమాలోని ఊహించని ట్విస్టులు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. జైలర్ సినిమాలో ప్రధాన నటీనటుల నటన ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలిచింది. తమన్నాకు మాత్రం జైలర్ సినిమా సక్సెస్ సాధించినా ఈ సినిమా వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. జైలర్ మూవీ సక్సెస్ తో అనిరుధ్ తో పని చేయాలని ప్రయత్నిస్తున్న హీరోలు, దర్శకుల సంఖ్య పెరుగుతోంది. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఆ రేంజ్ లో పారితోషికం ఇచ్చినా అనిరుధ్ డేట్స్ దొరుకుతాయని గ్యారంటీ అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనిరుధ్ (Anirudh) దేవర సినిమాతో టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కు చాలామంది ఫిదా అవుతున్నారు. సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అనిరుధ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆయన టాలెంట్ కు ఇప్పటివరకు వచ్చిన గుర్తింపు చాలా తక్కువని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా సినిమాకు అనిరుధ్ రేంజ్ పెరుగుతుండగా చిన్న వయస్సులోనే అనిరుధ్ కెరీర్ పరంగా ఎదిగిన తీరుపై ప్రశంసలు వ్యకమవుతున్నాయి. అనిరుధ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెహమాన్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా అనిరుధ్ మాత్రం అంతకు మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!