రియా చక్రవర్తి అరెస్టుపై బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలింది. ‘అది రియా రాసుకున్న కర్మ’ అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే కామెంట్ చేసింది. మరికొంతమందికి ఆమె అరెస్టు సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవాలి. వాళ్ళ ట్వీట్లు, పోస్టులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. రియా చక్రవర్తికి కొంతమంది మద్దతుగా మాట్లాడారు. “సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను అరెస్ట్ చేయలేదని సంబరాలు చేసుకుంటున్నవాళ్ళు గ్రహించాలి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చెయ్యలేదు.
సుశాంత్ జీవించి ఉంటే అదే కేసులో అరెస్ట్ అయ్యేవాడు” అని తాప్సి సహా కొందరు ట్వీట్లు చేశారు. అయితే, రియా చక్రవర్తి అరెస్టు ద్రౌపది వస్త్రాపహరణంతో ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పోల్చింది. ‘మహాభారతం’లో నిండుమహాసభలో ద్రౌపదికి ఎటువంటి అవమానం జరిగిందో, నేటి భారతంలో రియా చక్రవర్తికి అటువంటి అవమానం జరిగిందనేది శ్వేతాబసు ప్రసాద్ అంటున్నది. ద్రౌపది వస్తాప్రహరణం ఇంకా కొనసాగుతున్నదని చెబుతున్నది. ఇది సిగ్గు అని ఆమె అన్నది.
హోలీ రోజున బాంగ్ సప్లై చేసేవాళ్ళను కూడా అరెస్ట్ చెయ్యాలని శ్వేతాబసు ప్రసాద్ డిమాండ్ చేసింది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన కేసులో ముంబైలో ప్రజలను అరెస్ట్ చెయ్యడం మొదలుపెడితే సగం సిటీ ఖాళీ అవుతుందని కొంతమంది ట్వీట్లు చెయ్యడం గమనార్హం. ముంబైలో గంజాయి గట్రా తీసుకోవడం కామన్ అంటున్నారు.