అనుదీప్ తో పాటు ఆ దర్శకుడు కూడా గుడ్ బై చెప్పేశాడా?

టాలీవుడ్లో ఏడాదికి 4,5 సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది ‘సితార ఎంటర్టైన్మెంట్స్’. ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు తీస్తుంటారు నాగ వంశీ (Suryadevara Naga Vamsi) . చిన్న హీరో.. పెద్ద హీరో అని లేదు.. దాదాపు టాలీవుడ్లో ఉన్న అందరి హీరోల వద్ద ‘సితార..’ వారి అడ్వాన్స్ లు ఉన్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin), మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla) వంటి ఒకటి రెండు సినిమాలు తీసిన వారు కూడా ‘సితార..’ లో లాక్ అయ్యారు అంటే అతిశయోక్తి లేదు.

డైరెక్టర్స్ విషయంలో కూడా ఇదే సీన్. పెద్ద డైరెక్టర్ బాబీ (K. S. Ravindra) నుండి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే తీసిన చిన్న చితక డైరెక్టర్లు కూడా ‘సితార..’ లో కథలు డెవలప్ చేసే పనిలో పడ్డారు. దాదాపు ఏడాది నుండి ఈ బ్యానర్లో సినిమా చేయాలని దర్శకుడు అనుదీప్ (Anudeep Kv) వెయిట్ చేస్తున్నాడు. రవితేజతో (Ravi Teja) సినిమా అనుకున్నారు. కానీ అది ఇటీవల వేరే దర్శకుడితో అదే బ్యానర్లో రవితేజ సినిమా ఫిక్స్ అయ్యింది.

అలాగే ‘హిట్’ (HIT).. చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) కూడా ఈ బ్యానర్ లో సినిమా చేయాలని చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ బేనర్లో అతని ప్రాజెక్టు ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. మరోపక్క ‘కలర్ ఫోటో’ (Colour Photo) దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) కూడా ఈ బ్యానర్లో సినిమా చేయాలని ఆశగా ఎదురుచూశాడట. అతని సినిమా కూడా సెట్ అవ్వకపోవడం వల్ల వేరే బ్యానర్లో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఇన్సైడ్ టాక్.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus