Skanda Movie: ‘స్కంద’ కి మరో గోల్డెన్ ఛాన్స్..!

గత నెల చివర్లో ‘స్కంద’ ‘పెదకాపు 1’ ‘చంద్రముఖి 2’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. లాంగ్ వీకెండ్ కాబట్టి ఈ సినిమాలకి బాగా కలిసి వస్తుంది అని అంతా భావించారు. కానీ మూడు సినిమాలకి అనుకున్న టాక్ అయితే రాలేదు. అయినప్పటికీ ‘స్కంద’ బాగానే కలెక్ట్ చేసింది. బోయపాటి శ్రీను సినిమాలకి మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి అని అర్థం చేసుకోవచ్చు. వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా కలెక్ట్ చేయదు అని అంతా అనుకున్నారు.

కలెక్షన్స్ తగ్గిన మాట నిజమే కానీ.. తీసిపారేసే రేంజ్లో అయితే కాదు. ఆ తర్వాత ‘మ్యాడ్’ అనే సినిమా వచ్చి హిట్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో ‘స్కంద’ కి ఇక ఛాన్స్ లేదు అని అనుకున్నారు అంతా..! కానీ రెండో వీకెండ్లో ‘స్కంద’ కూడా సత్తా చాటింది. మాస్ సెంటర్స్ లో రెండో వీకెండ్ రూ.3.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. అలాగే వీక్ డేస్ లో కూడా డీసెంట్ షేర్స్ ను రాబడుతుంది.

ఇక అక్టోబర్ 13న కూడా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో (Skanda) ‘స్కంద’ కి మూడో వీకెండ్లో కూడా ఎక్కువ స్క్రీన్స్ లభించాయి. శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టకపోతే ‘స్కంద’ కి ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో మూడో వీకెండ్లో కూడా ‘స్కంద’ మంచి వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా బోయపాటి లక్కీ అనే చెప్పాలి

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus