Venu , Dil Raju: వేణు – దిల్‌ రాజు సినిమా.. ఇద్దరు ఔట్‌.. మూడో పేరు ఇన్‌.. ఎవరంటే?

కొన్ని సినిమాల జాతకం అంతేనేమో.. అంతా ఓకే మొదలైపోతుంది అని అనుకున్నప్పుడల్లా ఏదో సమస్య వచ్చి వెనక్కి వెళ్లిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల గురించి టాలీవుడ్‌ సీనియర్లు చెబుతూనే ఉంటారు. మరీ అంత కష్టం కాదు కానీ.. ఇంచుమించు ఇలాంటి కష్టమే ఎదుర్కొంటున్నారు ‘బలగం’ (Balagam) దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) . తొలి సినిమాతో అవార్డుల పంట పండించుకున్న ఆయన రెండో సినిమా ఇంకా స్టార్ట్‌ చేయలేదు. చాలా నెలలుగా వేణు కొత్త సినిమా ఇదే, వీరితోనే అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

Venu , Dil Raju

అనుకున్నట్లుగానే ఆ వార్తల్లో నిజం ఉంది అని తెలుస్తోంది. అలా ఇప్పుడు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా మరో ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) అవుతుంది అంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఆ హీరోనే లేటెస్ట్‌ కృష్ణుడు. అవును శర్వానంద్‌కు వేణు కథ చెప్పారని టాక్‌. ‘బలగం’ సినిమా తర్వాత వేణుతో మరో సినిమా చేయడానికి దిల్‌ రాజు (Dil Raju) రెడీ అయ్యారు. ఈ మేరకు నానికి (Nani) కథ వినిపించడం, ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయాయి.

కానీ ఫైనల్‌ డ్రాఫ్ట్‌ విషయంలోనే ఇబ్బంది వచ్చి సినిమాను పక్కనపెట్టేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ నితిన్‌ (Nithin Kumar)  దగ్గరకు వెళ్లింది అని వార్తలొచ్చాయి. కట్‌ చేస్తే ఆయన కూడా నో అన్నారు అని తెలిసింది. ఈ క్రమంలో మూడో హీరో దగ్గరకు కథ వెళ్లింది అంటున్నారు. ఈ క్రమంలోనే వేణు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు శర్వానంద్‌ (Sharwanand) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. వేణు ఓ యూత్ ఫుల్ కథ సిద్ధం చేసి శర్వానంద్‌కు చెప్పారని..

ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు. మరి ఇంతకుముందు నాని, నితిన్‌కి చెప్పిన కథ ఇదేనా? వేరేదా అనేది తెలియాల్సి ఉంది. శర్వా – దిల్‌ రాజు  కాంబినేషన్‌లో ఇలానే చిన్న సినిమాగా వచ్చిన ‘శతమానం భవతి’ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

జాన్వీని ప్రచారం కోసమే వాడుకుని.. ఫ్యాన్స్‌ని మోసం చేశారుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus