Janhvi Kapoor: జాన్వీని ప్రచారం కోసమే వాడుకుని.. ఫ్యాన్స్‌ని మోసం చేశారుగా..!

‘దేవర’ (Devara). సినిమాను ఎవరి కోసం చూస్తున్నారు? అంటే ఎక్కువగా వినిపించే ఆన్సర్‌ తారక్‌ (Jr NTR)  కోసం అని. ఎందుకంటే తారక్‌ విశ్వరూపం ఈ సినిమా. అంతేకాదు సినిమా చూసినా ఇదే మాట చెబుతారు కూడా. అయితే ఇక్కడ మరో యాక్టర్‌ ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. వాళ్లు బాగా హర్ట్‌ అయ్యారు. మీరు సినిమా చూసి ఉంటే.. ఆ యాక్టర్‌ ఎవరో చెప్పేస్తారు. చూడకపోతే ఆ యాక్టర్‌ జాన్వీ కపూర్‌  (Janhvi Kapoor)  . అవును, ఆమె ఫ్యాన్స్‌ అయితే హర్ట్‌ అయ్యారు.

Janhvi Kapoor

జాన్వీ కపూర్‌ తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయినా.. హిందీ సినిమాలతో, సోషల్‌ మీడియాతో తెలుగు కుర్రకారుకు బాగా పరిచయం. దానికితోడు ‘దేవర’ సినిమా ప్రచారం కోసం టీమ్‌ జాన్వీ అందాలను బాగానే వాడుకుంది. ‘చుట్టమల్లె..’, ‘దావుదీ..’ పాటల్లో జాన్వీ అందాల ఆరబోత మనం చూడొచ్చు. ట్రైలర్లలో కూడా ఆమె గ్లామర్‌ షో బాగానే ఉంది. దీంతో పెద్ద తెర మీద చూసి మురిసిపోదాం అనుకున్నారంతా.

అయితే, సినిమా రిలీజ్‌కి ఒకట్రెండు రోజులు ఉంది అనగా ‘సినిమాలో జాన్వీ సెకండాఫ్‌ లోనే వస్తుంది’ అనే పిడుగులాంటి వార్త వచ్చింది. ఇది నిజం కాకూడదు అనుకుంటూ థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులకు మొదటి హాఫ్‌ పూర్తయినా ఆమె కనిపించకపోయేసరికి ఉసూరు మన్నారు. పోనీ సెకండాఫ్‌ వచ్చాక ఆ రెండు పాటలు ఉంటాయి అనుకుంటే అదీ లేదు. దీంతో గ్లామర్‌ మిస్‌ అయింది అనే ఫీలింగ్‌ ఫ్యాన్స్‌లో వచ్చింది.

మరికొందరైతే ప్రచారంలో మొత్తం జాన్వీని నింపేసిన టీమ్‌.. సినిమా దగ్గరకు వచ్చేసరికి ఆమెను గెస్ట్‌ రోల్‌లా వాడారు అనుకుంటూ బాధపడుతున్నారు. రెండో పార్టులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది అని ఆశపడుతున్నారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పటివరకు జరిగిన కథ, ఆమె పాత్ర చూశాక అంత సీన్‌ లేదు అని అనిపిస్తోంది. మామూలుగా అయితే హీరోకు స్ఫూర్తిరగిలించేలా హీరోయిన్స్‌ పాత్ర రాస్తుంటారు. కానీ ఇందులో ఆ పరిస్థితి లేదు. కాబట్టి జాన్వీ పాటలు, అందాలేనా? అని నిరుత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది.

ఆదిత్య హాసన్ ఫస్ట్ మూవీ ఆ బ్యానర్లోనే అంటే..!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus