Nagarjuna: బంగార్రాజులో ఆ హీరోయిన్ కు ఛాన్స్?

స్టార్ హీరో నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగార్జున, రమ్యకృష్ణ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి ఫైనల్ అయ్యారని వార్తలు రాగా నాగార్జునకు జోడీగా శ్రియ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. నాగార్జున అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం రమ్యకృష్ణ నాగార్జునకు జోడీగా నటిస్తారని భావించగా నాగార్జున మాత్రం రమ్యకృష్ణకు హ్యాండిచ్చారని ప్రచారం జరుగుతోంది..

నాగార్జున శ్రియ కాంబినేషన్ లో తెరకెక్కిన నేనున్నాను, సంతోషం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో తెరకెక్కనున్నట్టు వస్తున్న వార్తల పట్ల ఫ్యాన్స్ సంతోషిస్తుండటం గమనార్హం. శ్రియను రమ్యకృష్ణ స్థానంలో తీసుకున్నారా..? లేక మరో పాత్ర కోసం తీసుకున్నారా..? తెలియాల్సి ఉంది. సోగ్గాడే చిన్నినాయన నాగార్జున కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించగా బంగార్రాజు ఆ సినిమాను మించి హిట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. నాగార్జున వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేని నాగార్జున బంగార్రాజు సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Most Recommended Video



‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus