పూరి జగన్నాథ్ మాటలు కఠువుగా ఉంటాయి కానీ… ఆలోచిస్తే అందులో జీవితం గురించి అవసరమైన చాలా విషయాలు తెలుస్తాయి. సినిమాల్లో అప్పుడప్పుడు అలాంటివి చెప్పడం ఎందుకు అనుకున్నారేమో… ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో కరోనా కాలంలో వివరిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన వైబ్స్ గురించి చెప్పుకొచ్చారు. మనిషి నెగెటివ్ మైండ్‌తో ఉండి… పాజిటివ్ లైఫ్ కావాలంటే కుదరదని అంటూ మరో జీవిత పాఠం చెప్పుకొచ్చారు. ఒక మనిషిని చూస్తే ఏదో తెలియని సంతోషం, ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అదే వేరొక మనిషిని చూస్తే వీడు ఎందుకు వచ్చాడురా బాబూ అనిపిస్తుంది.
ఇలాంటి ఫీలింగ్స్‌నే వైబ్స్ అంటారు. ఇలా ప్రతి ఒకరిలో గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్ అని రెండు రకాలుంటాయి. మామూలుగా ప్రతి మనిషి నుండి ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనిషి నుండి వచ్చే ఎనర్జీ ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలి. ఎందుకంటే ఆ వైబ్సే మనిషి జీవితాన్ని మారుస్తాయి అని చెప్పారు పూరి జగన్నాథ్. సాయిబాబా ఫొటోలు చూస్తే ఆయన వెనుక ఒక రకమైన వెలుతురు కనిపిస్తుంది. దాన్నే ఆరా అంటారు. నిజానికి అలాంటి వెలుతురు ప్రతి మనిషికీ ఉంటుంది. దాన్ని ఫొటో తీయడానికి ఒక స్పెషల్ కెమెరా కూడా ఉంది.
దాన్ని క్రిలియన్ ఫొటోగ్రఫీ అంటారు. అంతేకాదు ఆర్లా అనే యాప్ కూడా ఉంది.. దాంతో సెల్ఫీ తీసుకుంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చెబుతుందట. అయితే ఆ యాప్ ఎంతవరకూ నిజమో చెప్పలేం. మనిషి చుట్టూ ఎవరికీ కనిపించని గ్లో ఉంటుంది. దాన్నే వైబ్ అంటాం. నెగెటివ్ మైండ్‌తో ఉండి… పాజిటివ్ లైఫ్ కావాలంటే కుదరదు. అందుకే మనమే కాదు, మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన వైబ్స్ బాగోకపోతే ఆఖరికి కుక్కలు కూడా కరుస్తాయ్ అంటూ లైఫ్ లెసన్ వివరించారు పూరి జగన్నాథ్.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!