Soundarya: నిర్మాతగా సౌందర్య చేసిన ఈ సినిమా గురించి తెలుసా.. ఏకంగా 2 నేషనల్ అవార్డులు!

‘మహానటి’ సావిత్రి తర్వాత ఆ రేంజ్లో పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకున్న నటిగా సౌందర్య (Soundarya) గురించి చెప్పుకోవాలి. చూడడానికి ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె.. గ్లామర్ పైన ఆధారపడకుండా.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేసి స్టార్ డం సంపాదించుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో రెండేసి సినిమాల చొప్పున చేసి తిరుగులేని స్టార్ గా ఎదిగింది. పేరుకు కర్ణాటకకు చెందిన అంటే కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఈమె పెద్ద స్టార్ గా ఎదిగింది.

Soundarya

తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెకు చాలా బాగా ఓన్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. సౌందర్య తండ్రి పేరు సత్యనారాయణ అయ్యర్.కన్నడలో ఈయన పేరుగాంచిన నిర్మాత. అలాగే రైటర్ కూడా..! మొదట్లో సౌందర్యకి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ తన తండ్రి పట్టుబట్టడం వల్ల ఆమె నటిగా మారింది. కొన్నాళ్ళకి సౌందర్య తండ్రి మరణించడం జరిగింది. ఈ క్రమంలో తన తండ్రి లెజెసీని కంటిన్యూ చేయడానికి ‘సత్యం మూవీ మేకర్స్’ అనే పేరుతో ఓ సంస్థని స్థాపించింది.

మొదటి ప్రయత్నంగా ‘ద్వీప’ అనే చిత్రాన్ని నిర్మించింది. 2002 లో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకుడు. ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.ఆమెకు నష్టాల్నే మిగిల్చింది ఈ సినిమా. అయినప్పటికీ ఈ చిత్రానికి 2 నేషనల్ అవార్డ్స్ వరించాయి. ఒక రకంగా సౌందర్య హ్యాపీనే. కానీ ‘ద్వీప’ మిగిల్చిన నష్టాల వల్ల ఆమె మళ్ళీ నిర్మాణ రంగం వైపుకి వెళ్ళలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus