ఇక ఆమె మాకు దక్కదు అనుకున్నాను: ఆకాశ్‌

పూరి జగన్నాథ్‌ సినిమాలు, లైఫ్‌ స్టైల్‌, కెరీర్‌ను డీల్‌ చేసే విధానం… ఇలా అన్నీ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటాయి. అన్నింట్లోనూ ఆయన యాటిట్యూడ్‌ కచ్చితంగా కనిపిస్తుంది. అదే యాటిట్యూడ్‌ తన పిల్లలకు ఇచ్చారు అంటుంటారు అతని సన్నిహితులు. అందుకే గెలుపోటములను ఒకేలా చూస్తుంటారు వారంతా. అలాంటి పూరి జగన్నాథ్‌ డెన్‌ నుండి మరో నిర్మాత ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని పూరి తనయుడు ఆకాశ్‌ పూరి ఇటీవల చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్‌కి ఇద్దరు సంతానం.

ఒకరు హీరోగా నటిస్తున్న ఆకాశ్‌ కాగా, రెండోది అమ్మాయి. ‘బుజ్జిగాడు’ సినిమాలో చిన్నప్పటి త్రిషగా నటించిన పవిత్ర. ప్రస్తుతం పవిత్రం ఎంబీఏ చదివిందట. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో కొన్ని ప్లాన్స్‌ ఉన్నాయట. వాటి విషయంలో తన సత్తా చాటాక ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటోందట. అలా కొద్ది రోజుల్లో పవిత్రను నిర్మాతగా టాలీవుడ్‌లో చూస్తామని చెప్పాడు ఆకాశ్‌ పూరి. ఈ విషయం చెప్పిన ఆకాశ్‌… చిన్నతనంలో జిరిగిన మరో విషయాన్ని కూడా చెప్పాడు.

ఆకాశ్‌ కెరీర్‌లో అదో పెద్ద హీరోయిక్‌ మూమెంట్‌ అట. ఓసారి విశాఖపట్నం బీచ్‌లో ఇద్దరూ కెరటాల మధ్య ఆడుకుంటున్నారట. అలా ఆడుకుంటుండగా పెద్ద అల వచ్చి పవిత్రను లాగేసింది. ఆ సమయంలో ఆల్‌ మోస్ట్ పవిత్ర మాకు లేదు అనుకున్నాడట ఆకాశ్‌. చూస్తుండగానే పవిత్రను లాక్కొని వెళ్తోందట. దీంతో ఆకాశ్‌ ఓ పెద్ద జంప్‌ చేసి పవిత్రను పట్టుకున్నాడట. ఆకాశ్‌కి ఈత బాగా వచ్చట. అందుకే పవిత్రను అలా కాపాడుకోగలిగా అని చెబుతాడు ఆకాశ్‌.

అలా పవిత్రను ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత బోరున ఏడ్చేశాడట ఆకాశ్‌. అంతలా ఎమోషనల్‌ అయ్యాడట. పవిత్ర, ఆకాశ్‌ చిన్నతనం నుంచి కొట్టుకునే వాళ్లట. ఏదో విషయంలో ఎప్పుడూ తిట్టుకునే వాళ్లట. అలాంటిది ఆ రోజు ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి రక్త సంబంధం అంటే ఇదే కాబోలు అని అనిపించిందట. ఈ ఇద్దరూ ‘బుజ్జిగాడు’ సినిమాలో లవర్స్‌గా నటించిన విషయం తెలిసిందే.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus