Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్‌ ప్లానింగ్‌ మారిందా… ఆమె వద్దందా?

త్రివిక్రమ్‌ సినిమా స్టార్‌ హీరో, స్టార్‌ హీరోయిన్‌, మరో కొత్త హీరోయిన్‌ ఉంటారు. అంతేకాదు ఓ పాత తరం స్టార్‌ హీరోయిన్‌ కూడా ఉంటారు. గురూజీ గత సినిమాలు చూస్తే ఎవరైనా ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడు మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. మరి అందులో ఆ పాత స్టార్‌ హీరోయిన్‌ ఎవరు? ఇప్పుడు ఇదే చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. దీనికి కారణం మొన్నటి వరకు ఒక పేరు, ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తుండటమే.

Click Here To Watch

మహేష్‌ బాబు సినిమా ఇటీవల ముహూర్తపు షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతారు. త్రివిక్రమ్‌ టీమ్‌ ప్రస్తుతం కాస్టింగ్‌ ఎంపికపై బిజీగా ఉందట. ఈ క్రమంలో సినిమాలో మహేష్‌బాబు పిన్ని పాత్రను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఈ సినిమాలో పిన్ని పాత్ర చాలా కీలకమని, అందుకే ఫేమస్‌ పాత తరం హీరోయిన్‌ను తీసుకుందామని టీమ్‌ అనుకుంటోందట. అందులో భాగంగా నాటి తరం నాయిక శోభన పేరు చర్చలోకి వచ్చిందట.

ఇప్పటికే త్రివిక్రమ్‌ అండ్‌ కో. శోభనతో మాట్లాడారని సమాచారం. ఆమె కూడా పాజిటివ్‌గానే స్పందించిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వస్తుందట. అయితే ఈ పాత్ర కోసం తొలుత రాధ పేరు అనుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆమె ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు. శోభన అయితే తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతోనే ఆమెను కాంటాక్ట్‌ అయ్యారని టాక్‌. త్రివిక్రమ్‌ గత సినిమాలు చూస్తే..

పవన్‌ కల్యాణ్‌ ‘అత్తారింటికి దారేది’లో నదియ, అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహా, పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ, ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’లో దేవయాని, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురంలో..’లో టబు కీలక పాత్రల్లో కనిపించారు. మరి ఇప్పుడు శోభన పేరు ఫైనల్‌ అవుతుందా, లేక మరో హీరోయిన్‌ పేరు పరిశీలనకు వస్తుందా అనేది చూడాలి. ఒకవేళ శోభన నటిస్తే అప్పటి ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus