Salaar2: సలార్2 సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించే లక్కీ బ్యూటీ ఆమేనా?

  • April 23, 2024 / 09:37 PM IST

సలార్ మూవీ సీక్వెల్ సలార్2 షూటింగ్ త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. సలార్1 (Salaar) హిట్ గా నిలిచినా ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ను నూటికి నూరు శాతం సంతృప్తి కలిగించలేదు. సలార్2 సినిమాతో మాత్రం ఈ పరిస్థితి మారుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అదే సమయంలో సలార్2 మూవీ మరింత స్పెషల్ గా ఉండేలా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సలార్2 సినిమాలో మరో హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని కియారా అద్వానీ (Kiara Advani) ఆ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం సలార్2 పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కియారా పాత్రతో ప్రశాంత్ నీల్ ఏమైనా ట్విస్ట్ ప్లాన్ చేశారేమో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సలార్2 సినిమాలో కియారా ప్రభాస్ కు లవర్ రోల్ లో కనిపిస్తారో లేక వైఫ్ రోల్ లో కనిపిస్తారో తెలియాల్సి ఉంది. సలార్2 సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్2 సినిమా 1500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సరైన రిలీజ్ డేట్ ను ఎంచుకుంటే సలార్2 మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సలార్2 సక్సెస్ సాధించడం ప్రశాంత్ నీల్ కెరీర్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.

సలార్1 క్లైమాక్స్ చిక్కుముడులకు జవాబు దొరకాలంటే మాత్రం సలార్2 విడుదలయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. సలార్2 సినిమాలో ప్రభాస్ రోల్ కు సంబంధించి ఎన్నో ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. సలార్2 సినిమా కోసం హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించారని భోగట్టా. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus