బాలయ్య, ప్రభాస్‌లతో సందడి చేయబోయే ఆ స్టార్.. షూటింగ్ ఎప్పుడంటే..?

‘‘అన్‌స్టాపబుల్’’ అనే పేరుకి తగ్గట్టే షోని ఆద్యంతం తనదైన శైలిలో రక్తి కట్టిస్తూ.. సెలబ్రిటీల్లోని ప్రేక్షకులకు తెలియని కొత్త కోణాలను చూపిస్తూ, కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూ.. వాటిని సరికొత్తగా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తూ.. ‘‘అన్‌స్టాపబుల్’’ షోని నంబర్ వన్ టాక్ షోగా నిలిబెట్టారు నందమూరి నటసింహం బాలయ్య బాబు.. ఫస్ట్ సీజన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ప్రేక్షకాభిమానులంతా రెండవ సీజన్ గురించి ఆసక్తిగా ఎదురు చూశారు..

ఇటీవలే సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది.. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్, ఫ్రెండ్స్ కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, నటి రాధిక లాంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ కమ్ పొలిటిషియన్లతో పాటు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి యంగ్ హీరోలను.. తెలుగు సినిమా 90 సంవత్సరాల సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, డి. సురేష్ బాబులను తీసుకొచ్చారు. 5వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది.

అలాగే.. 6వ ఎపిసోడ్‌కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్టుగా రాబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. డార్లింగ్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా రాబోతున్నాడట.. ఆ స్టార్ ఎవరో కాదు.. రెబల్ స్టార్ క్లోజ్ ఫ్రెండ్, మాచో హీరో టి. గోపిచంద్.. ప్రభాస్, గోపి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.. ‘వర్షం’ మూవీలో గోపి విలన్‌గా నటించాడు. అతని సినిమా ఫంక్షన్లకి, ఫ్యామిలీ ఫంక్షన్లకి కూడా ప్రభాస్ అటెండ్ అయ్యేవాడు..

వాస్తవానికి ఫస్ట్ సీజన్‌లోనే ప్రభాస్ వస్తాడని అన్నారు కానీ అప్పటి బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు.. ఇప్పుడూ మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి.. వీలు చేసుకుని బాలయ్య షోకి రావడానికి టైం సెట్ చేసుకున్నాడు డార్లింగ్.. డిసెంబర్ 11న ప్రభాస్, గోపిచంద్ కలిసి నటసింహ బాలయ్య బాబుతో సందడి చేయబోయే 6వ ఎపిసోడ్ షూటింగ్ జరుగబోతుందని సమాచారం..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus