Dhanush: రెండేళ్ల తర్వాత సినిమా మారిపోయిందట.. శేఖర్‌ కమ్ముల ఏం చేశారంటే?

సింగిల్‌ స్టార్‌ హీరో సినిమాగా మొదలై… ఆ తర్వాత మల్టీస్టారర్‌గా సినిమా మారిపోవడం చాలా అరుదు. ఇటీవల కాలంలో ఇలా మారిపోయిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘వాల్తేరు వీరయ్య’ అని చెప్పాలి. ఇప్పుడు ఇదే దారిలో మరో సినిమా వచ్చింది. రెండేళ్ల క్రితం సింగిల్‌ హీరో సినిమా ప్రయాణం మొదలై.. కథను డెవలప్‌ చేసే క్రమంలో మల్టీస్టారర్‌గా మారిపోయింది. అదే ధనుష్‌ – శేఖర్‌ కమ్ముల సినిమా. అవును ఈ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మరో స్టార్‌ హీరో ఎంట్రీ ఇస్తున్నాడట.

తెలుగు ప్రేక్షకులకు ధనుష్ (Dhanush) సుపరిచితుడే. ఆ మాటకొస్తే ఆయన హిందీలో కూడా ప్రవేశించడంతో పాన్‌ ఇండియా హీరో అయ్యాడు. ఆయన తెలుగు దర్శకులతో పని చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో ‘సార్’ అనే సినిమా చేశాడు. అయితే అది ఆయన రెండో తెలుగు సినిమా అవ్వాలి. ఎందుకంటే తొలుత ధనుష్‌ ఓకే చేసిన సినిమా శేఖర్ కమ్ములది. ఆ సినిమా అనౌన్స్‌ అయ్యాకనే ‘సార్‌’ పట్టాలెక్కింది. ఇప్పుడు, అంటే రెండేళ్ల తర్వాత ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభమవుతుంది అంటున్నారు.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నాడట. అయితే ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అలాగని అతిథి పాత్ర కూడా కాదట. కానీ సినిమాలో కీలక పాత్ర కావడంతో నాగార్జునను శేఖర్ కమ్ముల సంప్రదించారట. కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున కూడా ఓకే చెప్పారని సమాచారం. ఈ సినిమా కోసం నాగార్జున 20 నుండి 30 రోజుల పాటు చిత్రీకరణ జరుపుతారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందనను కథానాయికగా తీసుకున్నారని అని చెబుతున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబరులో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తారట. తొలుత నాగార్జున సన్నివేశాలే చిత్రీకరిస్తారని కూడా చెబుతున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus