నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్లతో తన సత్తా చాటాడు. అఖండAkhanda) , వీరసింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి (Bhagavath Kesari) బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు, అదే జోష్‌తో ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj) సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. బాబీ (Bobby) (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు, అలాగే త్రివిక్రమ్ (Trivikram) భార్య సాయి సౌజన్య (Sai Soujanya) ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నారు.
ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కాంబినేషన్‌తో బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ విషయంలో వచ్చిన లీక్స్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
వారి పాత్రలు సినిమాలో కీలకమైన మలుపులకు కారణమవుతాయని టాక్. వీరు ఎవరో త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ గెస్ట్ అప్పియరెన్స్ షూటింగ్ పూర్తవడం, త్వరలోనే డబ్బింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) , ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) బాలయ్యకు జోడీగా నటిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బీజీఎమ్ కూడా పెద్ద ప్లస్ అవుతుందని అంటున్నారు.
మొదటి పాట త్వరలో విడుదల కానుంది, అది సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడం ఖాయం. బాలయ్య కెరీర్‌లో ఇది మరో బిగ్ రికార్డు చిత్రంగా నిలవబోతుందని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. సంక్రాంతి బరిలో డాకు మహరాజ్, గేమ్ చేంజర్ (Game Changer) , సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో క్లాష్ పై మరింత హైప్ నెలకొంది.