మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ తుది దశకి చేరుకుంది. నిజానికి ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా డిలే అవుతూ వస్తుంది. నిజానికి ఈ ఏడాది మే 13న ‘ఆచార్య’ ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ వాయిదా పడింది.ఇంకా ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది.
జూలై 10న ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించి ఆ పోర్షన్ ను ఫినిష్ చేయాలని టీం భావిస్తుంది. ఇందులో రాంచరణ్- పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని వినికిడి.ఇదిలా ఉండగా..’ఆచార్య’ కు సంబంధించి ఓ కీలక సన్నివేశం అలాగే ట్విస్ట్ లీకైనట్టు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం..’ ‘ఆచార్య’ సినిమాలో సంగీత ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈమె కారణంగా స్టోరీ మలుపు తిరుగుతుందని వినికిడి.
‘ఆచార్య’ లో రాంచరణ్ 45నిమిషాల నిడివిగల పాత్రని పోషిస్తున్నాడు. ఫైనల్ గా ఈ పాత్ర చనిపోతుంది. ఈ పాత్ర ఎలా చనిపోయింది..?అనే వివరాలను హీరో చిరుకి వివరించి.. ప్రత్యర్థుల నిజస్వరూపాన్ని బయటపెట్టే విధంగా సంగీత పాత్ర ఉంటుందని వినికిడి.మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!