Suriya: మరోసారి విలన్‌గా సూర్య… ఎవరి సినిమాలో అంటే?

సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేసి ప్రారంభించారు కూడా. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది అని కూడా చెప్పారు. తాజాగా సినిమాకు సంబంధించి ఎవరూ ఊహించని ఓ పుకారు బయటకు వచ్చింది. దాని ప్రకారం అయితే సూర్య మరోసారి ‘రోలెక్స్‌’లా ఓ స్టైలష్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. అవును ఈ సినిమాలో విలన్‌ కూడా సూర్యనే అంటున్నారు.

సూర్య హీరోగా నటిస్తూ విలన్‌గా నటించడం కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాల్లో నెగటివ్‌ టచ్‌ ఉన్న రోల్స్‌లో కనిపించి మెప్పించాడు. ‘24’ సినిమాలో సూర్య విలనీని చూసి ఆనందించని ఫ్యాన్స్‌ ఉండరు. ఇక ‘విక్రమ్‌’ సినిమాలోని రోలెక్స్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ పాత్ర మీద ఏకంగా సినిమానే తీద్దామని ఫిక్స్‌ అయ్యారు కూడా. ఇప్పుడు ద్విపాత్రాభినయం చేయడానికి ఫిక్స్‌ అయ్యారు. అంటే హీరో, విలన్‌గా అన్నమాట.

భారీ అంచనాలతో వచ్చిన ‘కంగువ’ సినిమా దారుణమైన పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడు షాక్ నుండి కోలుకుంటున్న సూర్య త్వరలో కార్తిక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా ‘రెట్రో’ చేస్తున్నారు. ఈ సినిమా తుది దశకు వచ్చిన నేపథ్యంలో ఆర్జే బాలాజీ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు. విలన్‌ కోసం వెతుకుతున్నారని తెలసింది కానీ.. ఇప్పుడు ఏకంగా విలన్‌గా ఆయన్నే ఫిక్స్‌ అయ్యారని టాక్‌.

సూర్య – త్రిష గతంలో ‘మౌనం పేసియాదే’ (ఆడంతే అదోటైపు) అనే సినిమాలో 2002లో నటించారు. ఆ తర్వాత 2004లో ‘యువ’లో కలసి నటించారు. మూడోసారి ‘ఆరు’ సినిమాలో 2005లో కలసి నటించారు. అయితే ‘ఆరు’లో జోడీనే ఇంకా ప్రేక్షకుల కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. ఆ సినిమాలో పాటలు, వారిద్దరి నటనే దీనికి కారణం. ఇప్పుడు సుమారు 20 ఏళ్ల తర్వాత నాలుగోసారి ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘అమ్మోరు తల్లి’ అంటూ నయనతార మంచి విజయం అందుకున్న ఆర్జే బాలాజీ ఈ సారి ఏం చేస్తారో చూడాలి.

 ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus