మెగాస్టార్‌ సినిమా కోసం ఆ బాలీవుడ్‌ నటుడు… అంత స్పెషల్‌ ఏంటి?

బాలీవుడ్‌ నటులు టాలీవుడ్‌లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో కొంతమంది నటులు ఇలా ఇక్కడకు వచ్చి యాక్ట్‌ చేసినవాళ్లే. ఇక హీరోయిన్ల సంగతి అయితే సరేసరి. వరుసగా మనం బాలీవుడ్‌ భామల్ని టాలీవుడ్‌కి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు విలన్లు వస్తున్నారు. టాలీవుడ్‌లో ఓ పెద్ద సినిమా తెరకెక్కుతోంది అంటే ఓ బాలీవుడ్‌ విలన్‌ పక్కా అనే మాట వచ్చేసింది. ఈ లెక్కన మరో బాలీవుడ్ నటుడు ఇప్పుడు తెలుగు సినిమాలో విలన్‌ అవుతున్నాడు. అది కూడా మెగాస్టార్‌ సినిమాలో.

మెగాస్టార్‌ చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్నవిషయంలో తెలిసిందే. ఇటీవల చిత్రీకరణ మొదలైన ఈ సినిమాకు సంబధించి కొన్ని సన్నివేశాలను గోదావరి జిల్లాల్లో తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిరంజీవి సూటింగ్లో పాల్గొంటారు అని సమాచారం. ఈ లోపు నటీనటులు, కథానాయికలు, విలన్‌ ఎంపిక పూర్తి చేసే పనిలో ఉంది టీమ్‌. అలా ప్రతినాయకుడిని ఓకే చేసేశారట. ఈ పాత్ర కోసం బాలీవుడ్‌ నుండి వెర్సటైల్‌ యాక్టర్‌ను తీసుకొస్తున్నారట.

చిరంజీవి – వశిష్ట కాంబినేష‌న్‌లో ఈ సినిమాకు ‘విశ్వంభ‌ర‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. క‌థానాయిక‌గా త్రిష ఎంపిక చేశారు అని టాక్‌. అయితే మరో ఇద్దరు కథానాయికలు ఉంటారు అని చెబుతున్నారు. విలన్‌గా బాలీవుడ్ నుంచి కునా క‌పూర్‌ని తీసుకున్నారట. ‘రంగ్ దే బ‌సందీ’ లాంటి హిట్ సినిమాలో తనదైన నటనతో మెప్పించడు కునాల్‌. ఆర‌డుగులకు పైనే ఎత్తు, హల్క్‌ స్టయిల్‌ ప‌ర్స‌నాలిటీతో విల‌న్ పాత్ర‌ల‌కు చక్కగా నప్పుతాడు అని కునాల్‌కు పేరు.

ఇప్పుడు అవే అంశాలు కునాల్‌ను సినిమాలోకి తీసుకునేలా చేశాయి. తొలుత ఈ పాత్ర కోసం రానాను అనుకున్నారట. కానీ వివిధ కారణాల వల్ల అవ్వలేదు అని టాక్‌. ఇంకో విషయం ఏంటంటే కునాల్‌పై షూటింగ్‌ కూడా జరుగుతోందని అని చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారట. ఈ క్యారెక్టర్‌ చిరు సందడి పాత (Chiranjeevi) మెగాస్టార్‌ను గుర్తు చేస్తుంది అని అంటున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus