Pushpa2: ‘పుష్ప2’లో మరో విలన్..!

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. తెలుగులో కాకుండా మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా వచ్చిన క్రేజే వేరు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దేశం మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ అండ్ టీమ్ ఎంతగానో కష్టపడుతుంది. స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో షూటింగ్ అనుకున్న సమయానికి మొదలుపెట్టలేకపోయారు.

ఫైనల్ గా ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. సీక్వెల్ లో ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ అవుతాడని.. అతడితో బన్నీ పోరు నేపథ్యంలో ప్రధానంగా కథ నడుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆ దిశగానే ‘పుష్ప’ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చి వదిలేశారు సుకుమార్. ఫహద్ తో పాటు సునీల్, అనసూయ, ధనుంజయ ఇలా సినిమాలో బన్నీకి చాలా మంది విలన్స్ ఉన్నారు.

అయితే ఇప్పుడు మరో విలన్ ని తీసుకురాబోతున్నారు సుకుమార్. ‘పుష్ప’ పార్ట్ 1లో బన్నీకి అండగా నిలిచే ఎంపీ పాత్రలో రావు రమేష్ కనిపించారు. ఎర్ర చందనం సిండికేట్ మొత్తం హీరో చేతిలో పెట్టి నడిపిస్తుంటారు. అయితే పార్ట్ 2లో ఈ రోల్ కి ఎదురు నిలిచి పుష్పను ఇబ్బంది పెట్టే ఒక పొలిటీషియన్ రోల్ ఉంటుందట.

అతడు, ఫహద్ కలిసి బన్నీతో పోరుకి దిగుతారట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనేది సుకుమార్ ఆలోచన. బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టితో పాటు మరికొందరిని ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. త్వరలోనే నటుడిని కన్ఫర్మ్ చేసి.. అనౌన్స్ చేయనున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus