Ante Sundaraniki Collections: కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిన ‘అంటే సుందరానికీ!’

నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఆగిపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.22 cr
సీడెడ్ 1.32 cr
ఉత్తరాంధ్ర 1.70 cr
ఈస్ట్ 1.02 cr
వెస్ట్ 0.85 cr
గుంటూరు 1.00 cr
కృష్ణా 1.01 cr
నెల్లూరు 0.62 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.70 cr
ఓవర్సీస్ 5.78 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.22 cr

‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.21.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు బిజినెస్ పై రూ.9.08 కోట్ల నష్టాలు వచ్చినట్టు స్పష్టమవుతుంది. మంచి టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

టికెట్ రేట్లు వంటివి తగ్గించి.. బిజినెస్ తక్కువ రేంజ్లో జరిగి ఉంటే ఈ మూవీ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది. ఇప్పుడైనా ‘అంటే సుందరానికీ!’ కలెక్షన్లు తీసిపారేసేవి అయితే కాదు. కానీ బిజినెస్ మీద తక్కువ రికవరీ అయ్యింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus