Ante Sundaraniki Trailer: బ్లాక్ బస్టర్ ఛాయలు కనిపిస్తున్నాయి…!

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అన్నీ సీరియస్ ప్లాట్లో సాగినవే. అతని సినిమాలకి ప్రధాన బలం కామెడీ. కొంత కాలంగా అతని సినిమాల్లో అది మిస్ అవుతుంది. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదల కాబోతుంది.

‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు.ఆల్రెడీ టీజర్ సూపర్ హిట్ అయ్యింది.వివేక్ సాగర్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. సుందర్ పాత్రలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు గా నాని, క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి లీలగా నజ్రియా నటన ఆకట్టుకునే విధంగా ఉంది. సుందర్ కు లీలని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది డ్రీం.

కానీ అతని కుటుంబం ఇందుకు అడ్డు పడుతుంది. ఈ క్రమంలో తమ ప్రేమని గెలిపించుకోవడానికి సుందర్ మరియు లీల చేసిన ప్రయత్నాలు ఏంటి? అనే కథాంశాన్ని వినోదాత్మకంగా చెప్పినట్టు ట్రైలర్ చెబుతుంది. నాని,నజ్రియా నటన కచ్చితంగా హైలెట్ అయ్యే విధంగా ఉంది.. వాళ్ళ పెయిర్ కూడా బాగుంది.నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ ఆకర్షించే విధంగా కనిపిస్తుంది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది.

నరేష్, హర్షవర్ధన్ ల కామెడీ ట్రాక్ అమితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే ఆశలు కల్పిస్తుంది ఈ ట్రైలర్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!


పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus