Anudeep,Suresh Babu: జాతి రత్నాలు డైరెక్టర్ రిటర్న్ గిఫ్ట్!

జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2021లో పెట్టిన పెట్టుబడికి అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాలో జాతిరత్నాలు టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. కేవలం నటీనటులు మాత్రమే కాకుండా డైరెక్టర్ అనుదీప్ కి కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తప్పకుండా మరొక మంచి సినిమాతో బాక్సాఫీసు వద్ద తన స్థాయి పెంచుకోవాలని దర్శకుడు చాలా రోజులుగా ఒక బైలాంగ్యువల్ కథపై చర్చలు జరుపుతున్నాడు.

ఇక మొత్తానికి ద్విభాషా చిత్రంగా శివకార్తికేయన్ తో ఒక సినిమాలో ఫిక్స్ చేసుకున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే దర్శకుడు అనుదీప్ మూడవ సినిమాను కూడా నాగ్ అశ్విన్ నిర్మాణంలోనే చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. కానీ అనుదీప్ మాత్రం తనకు మొట్టమొదటి సినిమా అవకాశం ఇచ్చిన బడా నిర్మాతతో సినిమా చేయబోతున్నాడు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనుదీప్ కొన్నాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ లో కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేశాడు.

అయితే సురేష్ బాబు అతని టాలెంట్ గురించి తెలుసుకొని మొదటి అవకాశం ఇచ్చాడు. 2016లో పిట్టగొడ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ కు దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ దారుణంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా వచ్చినట్లు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఇక నాగ్ అశ్విన్ సపోర్ట్ తో జాతిరత్నాలు సినిమా చేసిన అనుదీప్ ఆ తరువాత సురేష్ బాబుతో వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. సురేష్ బాబు ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్ లో సక్సెస్ చూడలేకపోయిన అనుదీప్ ఇప్పుడు అదే బ్యానర్ లో ద్విభాషా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

అలాగే ఏషియన్ సినిమాస్, శాంతి టాకీస్ బ్యానర్స్ కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్గున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus