Anupama: టిల్లు స్క్వేర్ లో… అనుపమనే హీరోయిన్.. ఒక్క వీడియోతో క్లారిటీ..!

2022 లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో పాటలు, కామెడీ యూత్ ను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేశాయని చెప్పొచ్చు.

అలాగే నేహాశెట్టి … సిద్దు జొన్నలగడ్డ కెమిస్ట్రీ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. అయితే మొదటి పార్ట్ ను తెరకెక్కించిన విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు కాదు. అతను తప్పుకున్నాడు. దీంతో ‘అద్భుతం’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్.. టిల్లు స్క్వేర్ కు దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇక హీరోయిన్ ను కూడా ఈ మూవీలో మార్చడం జరిగింది.

మొదట శ్రీలీల ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకుంది. తర్వాత అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని అనౌన్స్ చేశారు. కొద్ది రోజులకు ఆమె కూడా తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. మొన్న 18 పేజెస్ ప్రమోషన్స్ లో కూడా ఆమెకు ఈ విషయమై ప్రశ్న ఎదురవ్వగా ఆమె స్పందించకపోవడంతో ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ సినిమాలో ముద్దు సీన్లు ఎక్కువగా ఉండడం వల్లనే హీరోయిన్స్ నో చెబుతున్నట్టు టాక్ నడించింది.

అయితే అనుపమ ఈ చిత్రం నుంది తప్పుకుంది అంటూ వస్తున్న వార్తలు వట్టి గాసిప్స్ అని తేలిపోయింది. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ మేకర్స్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో హీరో సిద్దు జుట్టు సరిచేస్తూ ఉంది అనుపమ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus