Anupama: ఆయన అన్నయ్యే అంటున్న అనుపమ.. అలా పిలవకూడదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాని హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈగల్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు భారీ స్థాయిలో వైవిధ్యంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ దర్శకుడు కార్తీక్ గురించి ప్రస్తావిస్తూ కార్తీక్ అన్నయ్య అంటూ కామెంట్లు చేశారు.

అయితే దర్శకుడిని అన్నయ్య అని పిలవడంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన మాస్ మహారాజ్ రవితేజ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ అన్నయ్య అని పిలవకూడదని చెప్పారు. ఆ పదాన్ని అందమైన అమ్మాయిలు వాడకూడదని ఈ విషయం ఎందుకు చెప్పానో ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవాలని రవితేజ కామెంట్లు చేశారు. అయితే అనుపమ (Anupama) మాత్రం తర్వాత కూడా కార్తీక్ అన్నయ్య అంటూ సంబోధించారు.

ఈగల్ మూవీ చాలా రోజుల క్రితమే సెన్సార్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే 7వ తేదీన కెమెరామేన్ గంగతో రాంబాబు రీ రిలీజ్, 8వ తేదీన యాత్ర2, 9వ తేదీన లాల్ సలామ్, 10వ తేదీన ట్రూ లవర్ సినిమాల రూపంలో ఈగల్ కు గట్టి పోటీ ఉంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రవితేజ కెరీర్ పరంగా భారీ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉండగా ఈగల్ సినిమా ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. రవితేజకు భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus