Anupama Parameswaran: లైవ్ లో బ్రేకప్ సంగతులు చెప్పిన అనుపమ!

‘అ ఆ’ సినిమాతో నటిగా టాలీవుడ్ కి పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ లో బిజీ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని.. ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’, ‘రౌడీ బాయ్స్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నట్లు చెప్పింది. కోలీవుడ్ లో అధర్వ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘తల్లిపొగాదే’ అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది.

ఇక కన్నడ ఇండస్ట్రీని మిస్ అవుతున్నట్లు.. మంచి ప్రాజెక్ట్ లో ఛాన్స్ వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ.. ‘గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్ అయింది’ అని తన బ్రేకప్ విషయాలు బయటపెట్టింది. గతంలో అనుపమ ప్రేమలో ఉందంటూ చాలా వార్తలు వచ్చాయి. ఓ హీరోతో రిలేషన్ లో ఉందంటూ ఓ రూమర్ చక్కర్లు కొట్టింది.

అలానే ఇండియన్ క్రికెటర్ బుమ్రాతో ఆమె రిలేషన్ లో ఉందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గానే బుమ్రా తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అనుపమ ఎవరితో రిలేషన్ లో ఉండేదనే విషయంలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus