Anupama Remuneration: టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పారితోషికం ఆ రేంజ్ లో ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోని ఈ హీరోయిన్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ప్రస్తుతం అనుపమ పారితోషికం కోటి రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం అనుపమ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అనుపమ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టైర్1 హీరోలకు జోడీగా నటిస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. టాలెంటెడ్ హీరోయిన్ గా పేరును సొంతం చేసుకున్న అనుపమ కథ నచ్చితే గ్లామర్ రోల్స్ లో కూడా నటించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

అనుపమ నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. అనుపమ ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుపమ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. డీజే టిల్లు సీక్వెల్ కావడంతో టిల్లు స్క్వేర్ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా తన సినిమాల విషయంలో సిద్ధు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిద్ధు కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సిద్ధు, అనుపమలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus