Anupama: తన రాశి కూడా అదే అంటూ వారి లక్షణాలను తెలిపిన అనుపమ!

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పేరు గురించి పరిచయం అవసరం లేదు.ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడపడమే కాకుండా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుపమ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనుపమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఉన్నఫలంగా జాతకాలు చెబుతూ అందరిని షాక్ కి గురి చేశారు.ముఖ్యంగా కుంభ రాశి వారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం ఏంటి అనే విషయాల గురించి తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు.

ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే కుంభ రాశి వారు చాలా కేరింగ్ గా ఉండడమే కాకుండా ఈ రాశి వారు కేవలం కొంతమందితో మాత్రమే ఎంతో సన్నిహితంగా, ప్రేమగా ఉంటారని చెప్పుకొచ్చారు.ఈ రాశి వారు ఇతరులను అంచనా వేయడంలో ముందు వరుసలో ఉంటారని అనుపమ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక ప్రతి ఒక్క విషయంలోనూ వీరు ఎంతో చాకచక్యంగా ఆలోచించడమే కాకుండా ఏం జరిగినా కూడా వెనక్కి తగ్గరని, ముఖ్యంగా ఎవరైనా అబద్ధాలు చెబితే సహించరని అబద్ధాలు చెప్పేవారన్న కుంభ రాశి వారికి చాలా అసహ్యం అంటూ కుంభరాశి వారి వ్యక్తిత్వం వారి లక్షణాలను తెలియజేశారు. ఇలా కుంభ రాశి వారి గురించి చెబుతూనే తనది కూడా అదే రాశి అని ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పోస్టు ద్వారా అనుపమ పరమేశ్వరన్ తనకు తానే ఎంతో ఇంటిలిజెంట్, స్మార్ట్ అని చెప్పకనే చెప్పేశారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus