Butterfly OTT: ప్రముఖ ఓటీటీలో బట్టర్ ఫ్లై… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. కార్తికేయ 2 సినిమా మంచి హిట్ అవడంతో ఈమె తదుపరి చిత్రం 18 పేజెస్ సినిమాని కూడా పలు భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే అనుపమ లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు బటర్ ఫ్లై అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో నిహాల్ కొదటి కథానాయకుడిగా నటించగా, ఘంటా సతీష్ బాబు రచన, దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక చావ్లా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus