Anurag Kashyap: రాజమౌళి నిజమైన రాక్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపించిన డైరెక్టర్!

తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయ మెరుగని దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రతి ఒక్కరు గుర్తించారు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది.

ఈ సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాకు ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఈ సినిమా కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశాలలోని ప్రేక్షకులు కూడా ఇప్పటికీ గుర్తుంచుకున్నారు అంటే ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వచ్చిందో అర్థమవుతుంది. తాజాగా స్విజర్లాండ్ న్యూచాటెల్‌లో ‘న్యూచాటెల్‌ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది.

ఇక్కడ సినిమాలను ప్రదర్శించే సమయంలో కొందరు బాహుబలి అంటూ గట్టిగా కేకలు వేశారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు అరవడంతో ఈయన వాటిని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ డైరెక్టర్ రాజమౌళిని ట్యాగ్ చేశారు. ఇలా ఈ వీడియో ట్యాగ్ చేయడమే కాకుండా రాజమౌళి గురించి ఈయన (Anurag Kashyap) కామెంట్ చేస్తూ…రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు.

ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కి రాజమౌళి స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పటికీ ప్రభాస్ బాహుబలి సినిమా క్రేజ్ ఈ స్థాయిలో ఉందని తెలుసుకున్నటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus