దేశంలో వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఉంది.. అయితే అలా మాట్లాడినప్పుడు ఒక్కోసారి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. సమాజానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడినప్పుడే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సమస్యను ఫేస్ చేసేవారిలో సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. అచ్చంగా ఇదే కారణంతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఇబ్బందిపడ్డారు. ఏకంగా ఈ కారణంతో అతనికి గుండె నొప్పి కూడా వచ్చిందట. అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ దర్శకుల్లో చాలా డిఫరెంట్.
ఆయన సినిమాలు కానీ, వ్యక్తిత్వం కానీ ఇతరులకు డిఫరెంట్‌గా ఉంటుంది. కీలకమైన విషయాల మీద సినిమాలు తీసే ఆయన, సమాజంలో అంతే కీలకమైన విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. ఈ కారణంతోనే ఆయన కూతురికి థ్రెట్టనింగ్ కాల్స్ ఎదుర్కొన్నాడట. ఆ కారణంగా అతని ఆరోగ్యం కూడా దెబ్బతిందట. ఈ విషయాల్ని ఆయన ఇటీవల ప్రస్తావించాడు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనురాగ్ కశ్యప్ ఆ మధ్య మాట్లాడారు.
ఆ సమయంలో కొందరు అనురాగ్ కశ్యప్‌పై, అతని కూతురు ఆలియా కశ్యప్‌పై విమర్శలు చేశారు. కొంతమంది అయితే ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరించారట. దీంతో ఆలియా తీవ్ర ఆందోళనకు గురైందట. కూతురి పరిస్థితి చూసి.. అనురాగ్ డిప్రెషన్‌లోకి వెళ్లారట. ఆ సమయంలో ఇవన్నీ వదిలేసి విదేశాలకు వెళ్లడమే మంచిదనిపించిందట. ఈ కారణంతోనే 2019లో ట్విటర్ అకౌంట్‌ను వాడడం కూడా ఆపేశారట. ఆ తర్వాత కుటుంబంతో కలసి పోర్చుగల్ వెళ్లిపోయారు అనురాగ్.
కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్ కోసం తిరిగి భారత్‌కు వచ్చారు. అయితే అదే సమయంలో కొవిడ్ పరిస్థితులు వచ్చాయి. దీంతో సినిమాలు ఆగిపోయాయి, వెబ్‌సిరీస్‌లూ ఆగిపోయాయి. ఈ ఒత్తిడి నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది, దీంతో గుండెపోటు కూడా వచ్చింది అని అనురాగ్ చెప్పాడు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉందంటే.. సగటు ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియా అబ్యూజ్ ఏమాత్రం మంచిది కాదు అని అందరూ గ్రహించాలి.