క్యాస్టింగ్ కౌచ్, మీటూ వంటి పేర్లు గత 3 ఏళ్ళుగా మనం వింటూనే ఉన్నాం. బాలీవుడ్ లో ‘మీటూ’ ఉద్యమం కొంత వరకూ ప్రభావం చూపించింది. అక్కడ చాలా ముంది పెద్ద వాళ్ళను సినిమాల నుండీ తప్పించారు. ఇప్పుడు దాని ప్రభావం తగ్గిందని కూడా టాక్ వచ్చింది. అయితే సౌత్ లో మాత్రం ఈ ఉద్యమం పెద్దగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. ఇక్కడ పూర్తిగా రివర్స్. మీటూ ఆరోపణలు ఎవరు అయితే చేశారో వాళ్ళని కొన్ని సినిమాల నుండీ తప్పించారు.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మొన్నటికి మొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అనుష్క కూడా స్పందించింది. అది ఏ పరిశ్రమలో అయినా కామన్ అని చెప్పుకొచ్చింది. తనకి అలాంటిది ఎదురుకాలేదు అన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అనుష్క మాట మార్చేసింది అనే చెప్పాలి.’నేను కూడా సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ వల్ల వేధింపులకు గురయ్యాను. సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఉంటాయి అని అందరికీ తెలిసిన సంగతే..! ఇందులో దాయడానికి ఏమీ లేదు.
టాలీవుడ్‌లోనూ ఇది ఉంది. నేను ముక్కుసూటితనంతో, ధైర్యంగా దాని నుండీ తప్పించుకోగలిగాను. అందుకే నాతో ఎవ్వరూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే, కొత్తగా వచ్చే వాళ్లకు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవు.నేను వేధింపులకు లొంగిపోకుండా ఇండస్ట్రీలో నడుచుకునే దాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.