Anushka: స్టార్ హీరోయిన్ అనుష్కకు ఆ పాట అంటే ఎంతో ఇష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అనుష్క ఒకరు కాగా అనుష్కకు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ అనుష్క కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే అనుష్కకు మిర్చి సినిమాలోని పండగలా సాంగ్ అంటే ఎంతో ఇష్టమట. ఈ సాంగ్ విని ఆమె ఎమోషనల్ కూడా అయ్యారని ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఒక సందర్భంలో వెల్లడించారు.

అనుష్క గత సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. మరోవైపు అనుష్క కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అనుష్క క్రిష్ కాంబోలో తెరకెక్కిన వేదం అప్పట్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడతాయి. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలు నవ్యత ఉన్న కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయనే సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా మంచి కంటెంట్ తో సినిమా తీస్తే క్రిష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం సులువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా భవిష్యత్తులో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాలి. క్రిష్, (Anushka) అనుష్క ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus