Anushka, Prabhas: మారుతి సినిమా విషయంలో మరో ఆసక్తికర రూమర్‌!

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో సినిమా అంటూ.. ఏ ముహూర్తాన పుకార్లు మొదలయ్యాయో కానీ, ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తిక రూమర్‌ ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికగా ఎదురుచూసే కాంబో ఈ సినిమాతో మరోసారి చూసే అవకాశం ఉండటమే ఆ పుకారుకు అంత ఇంపార్టెన్స్‌ ఇస్తోంది. అదే ప్రభాస్‌ – అనుష్క జోడీ.

Click Here To Watch NOW

వెండితెరపై ప్రభాస్‌ – అనుష్కను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే వచ్చే కిక్కే వేరు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, సగటు సినిమా అభిమానికి కూడా ఆ ఫ్రేమ్‌ కనుల పండువగా ఉంటుంది. ఇద్దరి జోడీకి సినిమాల్లోనే కాదు, బయట కూడా ఫ్యాన్స్‌ ఉండటమే కారణం. అయితే ‘బాహుబలి’ తర్వాత ఈ ఇద్దరూ కలసి నటించలేదు. అయితే ఇప్పుడు మారుతి సినిమాతోనే ఆ జోడీని మరోసారి చూడొచ్చు అని సమాచారం. ప్రభాస్‌ – మారుతి కాంబోలో ఓ సినిమా మెటీరియలైజ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

మారుతి అయితే ఒప్పుకోలేదు కానీ.. బ్యాగ్రౌండ్‌లో ప్రభాస్‌ సినిమా పనులు మొదలయ్యాయి అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా ఉంటుంది అని ఆ మధ్య పుకార్లు మొదలయ్యాయి. ఇదో ఫ్యామిలీ డ్రామా అని కొందరు, కాదు కాదు హారర్‌ కామెడీ అని ఇంకొందరు చెబుతున్నారు. ఇందులో ముగ్గురు నాయికలకు ఛాన్స్‌ ఉందని గతంలోనే వార్తలొచ్చాయి. ఇద్దరు నాయికల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని, మూడో నాయిక కోసం చూస్తున్నారని టాక్‌. ఆ మూడో నాయిక అనుష్క అని లేటెస్ట్‌ బజ్‌.

‘రాజా డీలక్స్‌’ అంటూ గతంలో ఈ సినిమాకు టైటిల్‌ పెట్టారని అన్నారు. అయితే ఈ సినిమా అది కాదని, ఆ టైటిల్‌ వేరే హీరో కోసమని చెబుతున్నారు. సో పేరు పెట్టని, ఇంకా ప్రకటించని ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రీలీల నటిస్తోందని చెప్పారు. ఈమెతోపాటు మాళవిక మోహనన్‌ పేరు కూడా గట్టిగా వినిపించింది. మూడో నాయిక కోసం రాశీ ఖన్నా, మెహరీన్‌ పేర్లు చర్చకొచ్చాయి. కానీ ఆ పాత్ర కాస్త సీనియర్‌ నాయికకు అయితే బాగుంటుందని మారుతి అనుకున్నారట. అందుకే అనుష్క పేరు బయటికొచ్చిందంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus