Anushka Sharma, Virat: కోహ్లీ అనుష్క కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలం ప్రేమించుకున్న వీరిద్దరూ 2017 డిసెంబర్ 11వ తేదీన పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఎంత ఘనంగా జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న నాటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి ప్రేమకు నిదర్శనంగా ఒక పాప కూడా పుట్టింది.

పాప పుట్టిన తర్వాత అనుష్క సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. భర్త , కూతురిని చూసుకోవటం కోసం తన మొత్తం సమయం కేటాయిస్తూ సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాణ పనులు కూడా ఆపేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వీరు ఒక కొత్త ఫామ్ హౌస్ ని కొనుగోలు చేసినట్లు బీ టౌన్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు వరుసగా ఇటీవల కొత్త ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. రణవీర్,దీపిక జంట కూడా కొత్త ఫ్లాట్ కోనుగోలు చేశారు.

ఇక ఈ క్రమంలో అనుష్క విరాట్ జంట కూడా ఇటీవల ముంబైలోని అలీ బాగ్ ప్రాంతంలో కోట్లు ఖర్చు చేసి ఒక ఫామ్ హౌస్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫామ్ హౌస్ ని కొనుగోలు చేయడానికి ఈ జంట దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలీబాగ్‌లోని జిరాద్ అనే గ్రామానికి సమీపంలో 8 ఎకరాల స్థలంలో వీరు కొన్న ఫామ్ హౌస్ విస్తరించి ఉంది.

బీ టౌన్ మీడియా సమాచారం ప్రకారం అనుష్క విరాట్ దంపతులు ఈ ఫామ్ హౌస్ కొనుగోలు చేయడానికి దాదాపు రూ.19.24 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ 1.15 కోట్ల డిపాజిట్‌ను ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలను సమీరా హ్యాబిటాట్స్ అనే పేరున్న రియల్ ఎస్టేట్ కంపెనీ పర్యవేక్షించినట్లు సమచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉన్నాడు. ఆసియా కప్‌లో టీమిండియా తరపున ఆడుతు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus