Anushka: కెరీర్‌ వరుస గ్యాప్‌లు కారణం ‘సైజ్‌ జీరో’… క్లారిటీ ఇచ్చిన అనుష్క… ఏం చెప్పిందంటే?

ఓ హీరో సినిమా రిలీజ్‌ అయినప్పుడు ఎంత క్రేజ్‌ ఉంటుందో, ఎంత బజ్‌ ఉంటుందో, ఎంతగా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తారో.. టాలీవుడ్‌లో ఇంచుమించు అలాంటి క్రేజ్‌ సంపాదించుకున్న కథానాయిక అనుష్క శెట్టి. స్వీటీగా పుట్టినా తెలుగులోకి అనుష్కగా వచ్చి అలరిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 ఏళ్ల నుండి సినిమాలు చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో వరుస సినిమాలు ఆమె నుండి రావడం లేదు. దాని గురించి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పింది.

సినిమాల నుండి నాకు చాలా గ్యాప్‌ వచ్చిన మాట వాస్తవమే అన్న (Anushka) అనుష్క… ‘భాగమతి’ సినిమా తర్వాత ఐదేళ్లకు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో వస్తున్నానని చెప్పింది. ఈ అనుకోని విరామానికి కారణం కథలు దొరక్కపోవడం కాదని, ‘భాగమతి’ సినిమా తర్వాత కావాలని తానే కొన్నాళ్లు విరామం తీసుకున్నానని చెప్పింది. ఆ సమయంలో ‘నిశ్శబ్దం’ కథతో వచ్చారని, కథ విభిన్నంగా ఉండటంతో ఓకే చేశానని తెలిపింది. అయితే రెండు, మూడు నెలల్లో పూర్తయిపోతుందనుకున్న సినిమా చాలా ఆలస్యమైంది అని వివరించింది.

‘నిశ్శబ్దం’ సినిమా కూడా అనుకోని విధంగా ఆలస్యం అవ్వడంతో… ముందుగా అనుకున్న గ్యాప్‌ను మరికొన్ని రోజులు పెంచాను. అందుకే ‘మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఆలస్యమైంది. అలా సినిమాలకు గ్యాప్‌ వచ్చింది అని చెప్పింది అనుష్క. అయితే ‘సైజ్‌ జీరో’ సినిమా కారణంగా ఫిట్‌నెస్‌ సమస్య వచ్చి సినిమాలకు దూరంగా ఉన్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని చెప్పింది. ‘సైజ్‌ జీరో’ సినిమా 2015లో వచ్చింది. ఆ తర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘బాహుబలి 2’, ‘భాగమతి’ చేశాను అని గుర్తు చేసింది అనుష్క.

తన విరామానికి ‘సైజ్‌ జీరో’ సినిమాకు ఏమాత్రం కారణం కాదని, ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని, అందుకే చేశాను అని చెప్పింది. సినిమాలకు విరామం తీసుకోవడమన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లు చేయడంతో, కాస్త రెస్ట్‌ అవసరం అని విశ్రాంతి తీసుకున్నాను అని చెప్పింది అనుష్క. అంతే తప్ప ఈ గ్యాప్‌కు ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కారణం కాదని క్లారిటీ ఇచ్చింది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus