టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) ‘బాహుబలి’ (Baahubali) తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మరిన్ని చిత్రాల్లో కనిపిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆమె తెరపై కాస్త తక్కువగా కనిపించడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించింది. ‘బాహుబలి 2’ (Baahubali2) తర్వాత అనుష్క నుంచి కేవలం మూడు సినిమాలే వచ్చాయి: ‘భాగమతి (Bhaagamathie) ,’ ‘నిశబ్దం (Nishabdham) ,’ మరియు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty).’ ఈ ఏడేళ్ల కాలంలో మూడు చిత్రాలు మాత్రమే రావడంతో, అనుష్క అభిమానులు మరిన్ని సినిమాలు ఆశిస్తున్నారు.
Anushka Shetty
కొందరు అనారోగ్య కారణాల వల్ల ఆమె తక్కువ సినిమాలు చేస్తుందని, మరికొందరు మంచి కథలు దొరక్కపోవడం వల్లే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు అనుష్క మళ్లీ ఫుల్ ఫాంలోకి రావడానికి సన్నద్ధమవుతోంది. 2025లో అనుష్క రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఘాటీ’ సినిమాతో ఆమె స్క్రీన్‌పై కనిపించనుంది. గతంలో ‘వేదం’ (Vedam) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన క్రిష్ (Krish Jagarlamudi) , ఈసారి ‘ఘాటీ’ సినిమాను విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దాడు.
ఇందులో అనుష్కను బోల్డ్ పాత్రలో చూసే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమా 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్. దీంతో పాటు అనుష్క మలయాళంలో కథనార్ అనే పీరియడ్ ఫాంటసీ చిత్రంలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. ‘కథనార్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ‘ఘాటీ’ తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించగా, ‘కథనార్’ మలయాళ ప్రేక్షకులకు చేరువవుతుంది. రెండు సినిమాలు కొద్దిగ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెబుతుండటంతో అభిమానుల్లో సంతోషం నెలకొంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో డీసెంట్ హిట్ అందుకొని, తనలోని నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. యంగ్ హీరో కంటే పెద్ద వయసు పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడున్న రెండు ప్రాజెక్టులు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం. ఈ రెండు చిత్రాల తర్వాత కూడా అనుష్క మరిన్ని సినిమాలతో రాబోతోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి లేటుగా వచ్చినా, ఈసారి అనుష్క తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది.