అనుష్క తెలివే వేరబ్బా … బాగా ఎస్కేప్ అయ్యింది..!

ప్రభాస్, అనుష్క ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యనే ఓ టీవీ షోలో ‘ఏదైనా వదులుకోవాల్సి వస్తే.. ప్రభాస్ తో స్నేహం వదులుకుంటావా..? లేక సినిమాలు వదులుకుంటావా?’ అని అనుష్కను ప్రశ్నించగా.. ‘సినిమాలే వదిలేస్తాను.. ప్రభాస్ తో స్నేహం మాత్రం వదులుకోలేను’ అంటూ జవాబిచ్చింది అనుష్క. ఆమె సమాధానం బట్టి.. వీరి మధ్య స్నేహం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ కు 40 ఏళ్ళు దాటినా, అనుష్క కూడా 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం.. అందులోనూ వీళ్ళు కలిసి నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అవ్వడం.. వీళ్లది సూపర్ పెయిర్ అనే ముద్ర పడడంతో.. కచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఓ రేంజ్లో వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని ఇద్దరూ అనేక సందర్భాల్లో తేల్చి చెప్పేసారు. అయినా ఆ వార్తలు ఆగలేదు.

‘మిర్చి’ సినిమాలో వీళ్ళిద్దరూ పెళ్లి బట్టలతో ఉన్న అన్ సీన్ పిక్ తో.. ‘#Prabhanushka’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసి.. ఓ రేంజ్లో పెళ్లి వార్తలు పుట్టించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘నిశ్శబ్దం’ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క తన ట్విట్టర్ అకౌంట్ ను మళ్ళీ యాక్టివ్ చేసింది. తన అభిమానుల కోసం ఓ చిట్ చాట్ సెషన్ ను కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజెన్.. ప్రభాస్, అనుష్కలు పెళ్లి బట్టలతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి ..’ ఈ ఫోటో గురించి ఒక మాట చెప్పండి?’ అంటూ కోరాడు. ఆ నెటిజెన్ ఇన్టెన్షన్ అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. అనుష్క కు కూడా కచ్చితంగా అర్ధమయ్యే ఉంటుంది.

కానీ ఆమె చాలా తెలివిగా ఆ ఫోటో గురించి స్పందించి ఎస్కేప్ అయిపోయింది.”మేమిద్దరం ఓ సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్న టైంలో తీసిన ఫొటో అది. తరువాత అది ఓ అందమైన పోస్టర్ గా కూడా మారింది. నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ లో చేసిన తొలి సినిమా కూడా” అంటూ ఆ చిత్రం నిర్మాతలైన వంశీ, ప్రమోద్ లకు థాంక్స్ చెబుతూ దండం పెడుతున్న ఎమోజిలను జత చేసింది. విషయం తెలిసి కూడా ఎంతో తెలివిగా.. చాలా సున్నితంగా స్పందించి ఎస్కేప్ అయిపోయింది మన స్వీటీ. ఏమైనా ఆమె టైమింగ్ కు, ఇంటెలిజెన్స్ కు మెచ్చుకోవాల్సిందే..!


Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus