Devara: అనుష్క డూప్ కి కూడా అవే తిప్పలు.. ఏకంగా ‘దేవర’ ఆఫర్ మిస్ అయ్యిందట..!

ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు 6 మంది మాత్రమే. వాళ్ళే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , ప్రభాస్  (Prabhas) , మహేష్ బాబు (Mahesh Babu) , అల్లు అర్జున్ (Allu Arjun) , ఎన్టీఆర్  (Jr NTR) , రాంచరణ్ (Ram Charan)..లు..!వీళ్లల్లో ప్రభాస్, మహేష్, పవన్ తప్ప మిగిలిన వాళ్ళంతా హైట్ తక్కువే. రాంచరణ్, అల్లు అర్జున్..ల పక్కన కొంతవరకు అడ్జస్ట్ చేయవచ్చు. కానీ ఎన్టీఆర్ ఇంకా హైట్ తక్కువ..! ఎంతో టాలెంట్, స్టార్ డం.. కలిగి ఉన్న ఎన్టీఆర్ కి ఇది పెద్ద మైనస్. కోటా శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు కూడా ఈ విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు.

మరోపక్క హైట్ గా ఉండే హీరోయిన్లని ఎన్టీఆర్ పక్కన అడ్జస్ట్ చేయడం అనేది సినిమా క్రూ మెంబర్స్ కి కొంచెం కష్టంగానే ఉంటుంది. హీరోయిన్ల విషయంలో అయితే అనుకోవచ్చు.. కానీ వీళ్ళ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్..లని కూడా ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమాల్లో చేసే ఫిమేల్ క్యాస్టింగ్ విషయంలో టీం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతుంది..! విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ హీరోగా ‘దేవర'(పార్ట్ 1 ) (Devara) రూపొందుతుంది.

కొరటాల శివ (Koratala Siva) దీనికి దర్శకుడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా టైం తీసుకున్నారు.కొన్ని ముఖ్య పాత్రల కోసం చాలా మందిని ఆడిషన్ చేశారు. ఆ టైంలో కన్నడ నటి రుషికా రాజ్ ను ఓ కీలక పాత్ర కోసం లుక్ టెస్ట్ చేశారట. ఆమెను కచ్చితంగా ఈ సినిమాలో తీసుకుంటున్నట్టు తెలిపి మరీ లుక్ టెస్ట్ చేశారట. ఆమె పాత్ర ప్రకారం.. ఇందులో పోలీస్ గా కనిపించాల్సి ఉంది. కానీ ఈమె 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈమె కీలక సన్నివేశాల్లో నటించాల్సి ఉందట.

అయితే ఎన్టీఆర్ హైట్ 5 ‘6’ – 5 ‘7’ కి మధ్య ఉంటుంది. సో మరీ ఎక్కువ హైట్ ఉందని భావించి రుషికా రాజ్ ను ‘దేవర’ నుండి తీసేసినట్టు సమాచారం. రుషికా రాజ్.. ‘బాహుబలి’ సినిమాలో అనుష్కకి డూప్ గా చేసింది. ఆ తర్వాత ‘అశ్మీ’ అనే సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు కన్నడలో వరుస సినిమాల్లో నటిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus