Anushka Video: కుటుంబంతో కలిసి కోలం వేడుకల్లో పాల్గొన్న అనుష్క.. వీడియో వైరల్..!

సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. బాహుబలి అరుంధతి భాగమతి వంటి ప్రతిష్టాత్మక సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క కొంచెం బొద్దుగా మారటంతో కొంతకాలం సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క సోషల్ మీడియాలో, మీడియాలో కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్కకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోలం పండుగ వేడుకల్లో అనుష్క పాల్గొనింది. తాజాగా మంగళూర్ లో జరిగిన భూత కోల వేడుకల్లో అనుష్క తన కుటుంబంతో కలిసి పాల్గొని సందడి చేసింది.

ఈ భూత కోల వేడుకల్లో పాల్గొన్న అనుష్క అక్కడి నృత్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. చాలా బొద్దుగా ఉండే అనుష్క ఇప్పుడు నాజూగ్గా తయారైనట్టు కనిపిస్తోంది. పట్టుచీర కట్టుకొని నాజూగ్గా కనిపిస్తున్న అనుష్క ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కాంతర సినిమా మొదట చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత ఊహించని విధంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కర్ణాటక రాష్ట్రంలోని సాంప్రదాయాన్ని ముఖ్యమైన భూతకోల నృత్యాన్ని ఈ సినిమా దర్శకుడు నటుడు అయిన రిషబ్ శెట్టి అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఈ భూత కోలా నృత్యానికి మంచి ఆదరణ లభించింది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus