బయోపిక్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘మహానటి’ తో ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం రూపాయికి రెండు రూపాయలు అదనపు లాభాల్ని తెచ్చిపెట్టడంతో అప్పట్లో సంచలనాలను సృష్టించిన కొందరి నేతల బయోపిక్ లను తెరకెక్కించి క్యాష్ చేసుకోవాలని కొంతమంది భావించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, వై.ఎస్.ఆర్,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. వంటి వారి బయోపిక్ లు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద డిజాస్టర్ అయ్యింది. పెద్దాయన పరువంతా ఈ బయోపిక్ తీసిపడేసిందనే చెప్పాలి. ఇక వై.ఎస్.ఆర్ బయోపిక్ పర్వాలేదు అనిపించింది కానీ ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో విడుదల అవ్వడంతో కమర్షియల్ గా రాణించలేకపోయింది. ఇక ‘సైరా’ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. అయితే బయోపిక్ తీస్తున్నారు..అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎంత ట్రాజెడీ ఉంటుంది అనేది కూడా దర్శక నిర్మాతలు పరిశీలించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే బెంగుళూరుకు చెందిన గాయని నాగ రత్నమ్మ బయోపిక్ ను తీయాలని దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తాపత్రయ పడుతున్నాడట. ఆమె జీవితంలో ఎంతో ట్రాజెడీ ఉందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. నాగ రత్నమ్మ చనిపోయే ముందు ఆమె ఆస్తి అంతా కళలకు అలాగే కళాకారులకు దారపోసిందట. ఇక ఈమె పాత్రకి అనుష్కని తీసుకున్నట్టు తెలుస్తుంది. బుర్రా సాయిమాధవ్ కూడా డైలాగ్ వెర్షన్ కు పనిచేస్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్