Anushka Shetty: క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!

సూపర్ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన అనుష్క శెట్టి ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అనుష్క గత సినిమా నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Click Here To Watch

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అనుష్క అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాలలో ఛాన్స్ ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోచర్చుకునే సంస్కృతి ఉందని ఆమె కామెంట్లు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రతి ఇండస్ట్రీలో ఉందని అనుష్క చెప్పుకొచ్చారు. అయితే తనకు మాత్రం అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని ఆమె అన్నారు. తాను సూటిగా, నిక్కచ్చిగా మాట్లాడతాను కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురవలేదని ఆమె తెలిపారు.

టాలీవుడ్ లో కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తాను ఒప్పుకుంటానని అనుష్క అన్నారు. తాను దురుసుగా ఉంటాను కాబట్టి తనతో ఎవరూ అలా ప్రవర్తించలేదని ఆమె చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి అనుష్క చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు కాగా అరుంధతి, మిర్చి, బాహుబలి, భాగమతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అనుష్క ఖాతాలో ఉన్నాయి.

అరుంధతి సక్సెస్ తర్వాత అనుష్క ఒకవైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనుష్క నటించిన సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం తమ సినిమాలలో అనుష్కను నటింపజేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్టార్ హీరోయిన్లు చెబుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus